యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క ఫ్లాపు కూడా లేకుండా దూసుకుపోతున్నాడు. ఒకదాన్ని మించిన విజయం ఇంకోటి.. అన్నట్టుగా అనిల్ రావిపూడి సినిమాలు సంచలన విజయాల్ని అందుకుంటున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు, టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్‌గా మారిన విషయం విదితమే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అనిల్ రావిపూడి రేంజ్ చాలా చాలా చాలా పెరిగిపోయింది. కానీ, అనిల్ రావిపూడి మాత్రం.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు.
ఇప్పటికే ‘ఎఫ్3’ కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని దాదాపుగా పూర్తి చేసేసిన అనిల్, ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమా కోసం కథ రెడీ చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ముందే అనిల్ - బాలయ్య కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే గాసిప్స్ వచ్చాయి. కానీ, అనూహ్యంగా మహేష్ నుంచి ఆఫర్ రావడంతో, బాలయ్యతో చేయాల్సిన కథని పక్కన పెట్టి, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాడట అనిల్. ‘ఎఫ్3’ తర్వాత, అనిల్ ఖచ్చితంగా బాలయ్యతో సినిమా చేస్తాడని అంటున్నారు.
మరోపక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ, అనిల్ రావిపూడి దర్శకత్వంలోనేనన్న ఊహాగానాలు కూడా జోరందుకుంటుండడం గమనార్హం. ఈ మేరకు అనిల్, రెండు కథల్ని దాదాపుగా ఖరారు చేసుకున్నాడట. అతి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.