సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తాజాగా ఓ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన త్వరలో ‘ఎఫ్ 3’ మూవీని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఆయన లిస్టులో మహేష్‌తో మరో సినిమా ఉందనే గాసిప్ కూడా విన వస్తోంది. ఇదిలా ఉంటే, నందమూరి నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా అంటూ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతోందనీ మాట్లాడుకుంటున్నారు.
ఈ గాసిప్‌కి అసలు కారణమేంటంటే, అనిల్ రావిపూడి ఆయన రూమ్‌లో బాలకృష్ణతో మోక్షజ్ఞ కలిసి దిగిన ఫోటో ఉందట. వారిద్దరి ఫోటో ఎందుకు పెట్టుకున్నారని అడిగితే, ఎప్పటికైనా వారిద్దరితో కలిసి సినిమా చేయాలని ఉందని అనిల్ రావిపూడి తెలిపారు. అంటే, బాలయ్యతో సినిమా కోసం అనిల్ రావిపూడి ట్రై చేస్తున్నాడన్న మాట. ఒకవేళ అదే నిజమైతే, ఈ మధ్య సక్సెస్‌లు రాక సతమతమవుతున్న బాలయ్యకీ, అనిల్ రావిపూడి రూపంలో ఓ సక్సెస్ వచ్చే అవకాశాల్లేకపోలేదు. చూడాలి మరి, ఈ కాంబినేషన్ ఎప్పటికి సెట్టవుతుందో.