‘ఎఫ్-2’ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఆ సినిమాతో అనిల్ దశ తిరిగిపోయిందంతే. ఏకంగా సూపర్ స్టార్ మహేష్‌బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ రావిపూడికి దక్కిందంటే అది ‘ఎఫ్-2’ విజయం ఇచ్చిన కిక్ తాలూకు ఎఫెక్టే మరి. అందుకే, ‘ఎఫ్-2’కి కొనసాగింపుగా ‘ఎఫ్-3’ తీయాలన్న తన ఆలోచనని మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత కూడా పక్కన పెట్టలేదు. మహేష్‌బాబు, ‘ఎఫ్-3’లో చేయబోతున్నాడంటూ ప్రచారం జరిగినా, అలాంటిదేమీ లేదని తాజాగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. ‘అవే పాత్రలుంటాయ్.. కథలో మార్పులుంటాయ్..’ అని అనిల్ రావిపూడి ‘ఎఫ్-3’ గురించి చెప్పాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికే ‘ఎఫ్-3’ వచ్చేదనీ, కానీ పరిస్థితులు మారిన దరిమిలా, కరోనా ఎఫెక్ట్‌తో ‘ఎఫ్-3’ గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అంటున్నాడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం ‘ఎఫ్-3’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడట అనిల్ రావిపూడి. అవే పాత్రలు.. అంటే బహుశా వరుణ్ తేజ్, వెంకటేష్‌లతోపాటు మెహ్రీన్ పాత్రని కూడా కొనసాగిస్తారేమో. తమన్నాని మాత్రం ‘ఎఫ్-3’ కోసం రీప్లేస్ చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి కాకపోతే, నెక్స్‌ట్ టైవ్‌ు దొరికేది వేసవిలోనే. అనిల్ ఎలాగూ సినిమా చాలా వేగంగా తీసేస్తాడు గనుక, సినిమా నిర్మాణానికి పెద్దగా టైవ్‌ు అతనికి అవసరం వుండకపోవచ్చు.