ఇలియానాకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువే. అందుక్కారణం, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫొటోలే. ఈ మధ్య ఎక్కువగా పాత ఫొటోలతోనే పండగ చేసుకుంటోంది ఇలియానా. తాజాగా మరో పాత ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇలియానా, దాంతోనూ తనదైన స్టయిల్లో పబ్లిసిటీ స్టంట్ షురూ చేసింది. బికినీలో ఫొటోకి పోజులిచ్చిన ఇలియానా, ఆ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదేమీ కొత్త కాదు. పాత ఫొటోనేగానీ.. ఆ ఫొటోతోపాటు ఇలియానా పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ప్యాంట్ వేసుకోలేదు..’ అంటూ ఇలియానా ఆ ఫొటోకి కామెంట్ పెట్టింది.
బహుశా బికినీ ఫొటో పెట్టినా తనను ఎవరూ పట్టించుకోవడంలేదనుకుందో ఏమో.. ఇదిగో ఇలాంటి చెత్త కామెంట్ వేసిందన్న చర్చ సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతోంది. ‘ఇలియానా మరీ ఇంత చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తావనుకోలేదు..’ అంటూ ఆమెని అభిమానులే తూర్పారబట్టేస్తున్నారు. అఫ్‌కోర్స్ ఇలియానా ఇలాంటి ట్రోలింగ్‌ని పెద్దగా పట్టించుకోదనుకోండి.. అది వేరే విషయం. అన్నట్టు, ఈ ఫొటోని ఇలియానా బాయ్‌ఫ్రెండ్ గతంలో తీశాడు. బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయాక, అతనికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళూ సోషల్ మీడియాలో లేకుండా చేసుకుంటోంది. మళ్ళీ రీ-యూనియన్ ఏమైనా జరిగిందేమో, ఆ పాత మధురాల్ని గుర్తు చేసుకుంటోంది ఇలియానా.