హీరోల చుట్టూ తిరుగుతున్న అనిల్ రావిపూడి

మరిన్ని వార్తలు

అనిల్ రావిపూడి.. ఇప్పుడు తిరుగులేని ఫామ్ లో ఉన్న ద‌ర్శ‌కుడు. త‌న‌తో ప‌ని చేయ‌డానికి హీరోలంతా ఎదురుచూస్తున్నారు. అలాంటిది అనిల్ రావిపూడి హీరోల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అదీ... ఎఫ్ 3 కోస‌మే. అవును ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 చేయాల‌ని అనిల్ రావిపూడి ఫిక్స్ అయ్యాడు. ఎఫ్ 2 ఓ మ‌ల్టీస్టార‌ర్‌. ఇద్ద‌రు హీరోలు (వెంక‌టేష్‌, వ‌రున్ తేజ్‌) క‌లిసి న‌టించారు. ఎఫ్ 3 లో మ‌రో హీరోని అద‌నంగా తీసుకొచ్చి, ఆ టైటిల్‌కి న్యాయం చేయాల‌ని అనిల్ రావిపూడి గ‌ట్టిగా ఫిక్స‌య్యాడు. కానీ ఆ మూడో హీరో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ దొర‌క‌లేదు.

 

అనిల్ రావిపూడితో ప‌నిచేయ‌డానికి హీరోలంతా ఇష్ట‌ప‌డుతున్నారు. కాక‌పోతే.. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో, అందులోనూ మూడో హీరోగానా? అనేద వాళ్లంద‌రి డౌటానుమానం. మూడో హీరోగా క‌నిపిస్తే, త‌మ ఇమేజ్ దెబ్బ‌తింటుంద‌ని, పైగా పెద్దగా స్క్రీన్ టైమ్ రాద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని టాక్‌. అందుకే అనిల్ రావిపూడి ఈ క‌థ‌తో వెళ్లిన ప్ర‌తీసారీ.. `సీక్వెల్ వ‌ద్దు.. సోలో హీరో క‌థ ఉంటే చెప్పు` అంటున్నార్ట‌. మ‌హేష్‌బాబు, ర‌వితేజ లాంటి పేర్లు ఎఫ్ 3 కోసం వినిపించాయి. వారిద్ద‌రూ ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు చేయ‌న‌ని చెప్పేశారు. ఆ స్థాయి హీరో దొర‌క్క‌పోతే ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది అనిల్ రావిపూడి భ‌యం. లేదంటే.. నాని, శ‌ర్వానంద్‌, నిఖిల్ లాంటి హీరోల‌తో స‌ర్దుకుపోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS