టాలీవుడ్ లో ఇప్పుడు తిరుగులేని దర్శకుల జాబితాలో నిలిచాడు అనిల్ రావిపూడి. తాను పట్టిందల్లా బంగారమే. ప్రతీ సినిమా సూపర్ హిట్టే. బడా హీరోలు.. అనిల్ కథ చెబుతాడేమో అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3తో బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. ఆ తరవాత నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. అయితే.. ఇది ఓ మల్టీస్టారర్ గా మారే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
బాలయ్యతో కలసి ఓ సినిమా చేయాలని కల్యాణ్ రామ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకోసం కొన్ని కథలు కూడా విన్నాడు. కానీ ఏదీ సెట్ కాలేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి.. బాలయ్య - కల్యాణ్ రామ్ కి సరిపడా కథ సిద్ధం చేశాడట. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసింది కల్యాణ్ రామ్ నే. అందుకే... బాలయ్య -కల్యాణ్ రామ్ - అనిల్ రావిపూడి.. సినిమా సెట్టయ్యే ఛాన్సుందని సమాచారం.
పటాస్ తరవాత.. కల్యాణ్ రామ్ తో మరో సినిమా చేయాలనుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు బాలయ్య కథతోనే ఆ ఛాన్స్ వచ్చేసింది. సో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట.