ఓ దారి మూసుకుపోతే... ఇంకొన్ని కొత్త దారులు తెరచుకుంటుంటాయి. అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది. స్టార్ హీరో తలచుకుంటే - దర్శకులకు కొరతేం ఉంటుంది..? బన్నీ ముందు కూడా దర్శకుల క్యూ కనిపిస్తోందిప్పుడు. పుష్ష తరవాత.. కొరటాల శివతో ఓ సినిమా చేయాలి బన్నీ. అయితే ఆ సినిమా కాన్సిల్ అయ్యింది. కాకపోతే.. బన్నీ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ బన్నీకి సరిపోయే ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ ని రెడీ చేశాడు. మరోవైపు వేణు శ్రీరామ్ `ఐకాన్` ఉండనే ఉంది.
ఇప్పుడు వంశీ పైడిపల్లి సైతం.. ఓ మంచి కథని బన్నీ కోసం రెడీ చేసినట్టు టాక్. ప్రశాంత్ నీల్.. సైతం బన్నీతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. సలార్ తరవాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చు. అయితే.. పుష్ష తరవాత ఏ దర్శకుడితో ప్రాజెక్టు ఓకే చేయాలన్నది బన్నీ ఇష్టం. పుష్ష తరవాత ఎలాంటి కథ చేయాలనుకుంటే.. అలాంటి కథ, అలాంటి దర్శకుడు బన్నీతో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. మొత్తానికి బన్నీ..ముందు మంచి సెటప్ ఉంది. ఏది ఎంచుకోవాలన్నది తన ఇష్టం.