మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న `సరిలేరు నీకెవ్వరు` ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తరవాత... అనిల్ రావిపూడికి మరో ఛాన్సిచ్చేశాడు మహేష్. `సర్కారు వారి పాట` తరవాత అనిల్ రావిపూడి తో సినిమా చేయాలి. అయితే ఈలోగా.. త్రివిక్రమ్ మధ్యలోకి వచ్చేశాడు. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే.
ఎప్పుడైతే.. త్రివిక్రమ్ వచ్చాడో, అప్పుడు అనిల్ రావిపూడిని పక్కన పెట్టాల్సివచ్చింది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వగానే... రాజమౌళి ప్రాజెక్టులోకి వెళ్లిపోతాడు మహేష్. అదెప్పుడు పూర్తవుతుందో తెలీదు. అందుకే... `మనం తరవాత చేద్దాంలే..` అని అనిల్ రావిపూడికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. పైగా.. అనిల్ ఇప్పటికే మహేష్ కి కథ చెప్పాడు.
సెకండాఫ్ లో మహేష్ కి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకే... మరో ఆలోచన లేకుండా, అనిల్ రావిపూడి సినిమాని హోల్ట్ లో పెట్టేశాడట. ప్రస్తుతం ఎఫ్ 3 పనుల్లో ఉన్నాడు అనిల్. ఆ తరవాత... బాలయ్యతో సినిమా చేసే ఛాన్సుంది.