చిన్న సినిమా అంటున్న పెద్ద సినిమాల దర్శకుడు!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. వరస విజయాలతో దూసుకుపోతున్న ఆయన 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత 'F3' సినిమాను పట్టాలెక్కించాలని అనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినప్పటికీ వెంకటేష్, వరుణ్ ఇద్దరూ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టారు.

 

'F3' మొదలు పెట్టే లోపుగా ఒక వెబ్ సీరీస్ కు దర్శకత్వం వహించాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారని ఈమధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అనిల్ మరో ఆలోచనలో ఉన్నారట. తక్కువ బడ్జెట్లో ఓ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పెద్ద సినిమాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి, యువ హీరోలతో స్మాల్ బడ్జెట్ అయితే త్వరగా పూర్తి చేయవచ్చని అనుకుంటున్నారట.

 

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం. అనిల్ రావిపూడి బలం అయిన కామెడీ జోనర్లోనే ఈ సినిమా కూడా ఉంటుందట. మరి ఏ హీరోతో ఈ సినిమా చేస్తారో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS