'ఫ్యాషన్ డిజైనర్ - సన్నాఫ్ లేడీస్ టైలర్' సినిమాతో పరిచయమైంది బ్యూటీ అనీషా ఆంబ్రోస్. తొలి సినిమాలోనే బీభత్సంగా అందాలారబోసి, తెలుగు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది. తాజాగా 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మడికి ఎక్స్‌పోజింగ్‌లో నో లిమిట్స్. బికినీ వేసుకోవడానికైనా సిద్ధమేనట అవసరాన్ని బట్టి. ఆ మధ్య ముద్దుగుమ్మ తేజస్వినితో కలిసి బీచ్‌లో బికినీ సొగసులతో రెచ్చిపోయింది. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మడు అందాల ప్రదర్శన మొదలెట్టేసింది. హాట్ హాట్ ఫోటో సెషన్స్ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. లైకులివ్వమంటోంది. లైక్స్ కొట్టేందుకు అమ్మడి గ్లామర్ షో బాగానే ఉంది. అలాగే ఓ పక్క లైకులు, మరో పక్క న్యూ ఆఫర్స్, ఆడియన్స్‌తో కొంచెం టచ్.. ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసే అమ్మడు ఈ ప్లాన్ వేసిందిలే.. ఏది ఏమైనా అనీషా ఆంబ్రోస్ హాట్‌గా కనిపించినా అందంగానే ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణతో 'విఠలాచార్య' సినిమాలో నటిస్తోందీ హాట్ బ్యూటీ అనీషా ఆంబ్రోస్.