సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'జవాన్'. ఇంటికొక్కడు అనేది క్యాప్షన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకున్నారు అంతా. కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు మారిపోయాయి. ఓ పక్క ఫ్యామిలీతో పాటు, మరో పక్క దేశ రక్షణనీ తన కర్తవ్యంగా భావించే కుర్రోడి కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దేశ రక్షణలో అత్యంత కీలకమైన ఆక్టోపస్ మిస్సైల్ సిస్టమ్‌ని కాపాడే నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఈ మిస్సైల్‌ని కాపాడే క్రమంలో ఓ సామాన్య యువకుడు ఏం చేశాడన్నదే స్టోరీ. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌కి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జత చేసి రూపొందించిన చిత్రమిది. బి.వి.యస్.రవి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పైన తెరకెక్కుంది ఈ చిత్రం. ముద్దుగుమ్మ మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రైలర్‌లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. యుద్దం మొదలయ్యాక.. పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.. ముందోడు కూలిపోయాడా.. అని కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం.' అని సాయి ధరమ్ తేజ్ చెబుతున్న డైలాగ్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి రొటీన్‌కి భిన్నంగా 'జవాన్' ఉండబోతోందని తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే. మామూలు ఫ్యామిలీ ఎమోషన్స్, మామూలు యాక్షన్ సీక్వెన్సెస్ అని కాకుండా, దేశభక్తి, బాధ్యత, కర్తవ్యం లాంటి విభిన్న అంశాలు మిక్స్ అయినట్లుగా అనిపిస్తోంది 'జవాన్' ట్రైలర్.
ట్రైలర్‌తో భారీగా అంచనాలు పెంచేశాడు సాయి ధరమ్ తేజ్. బ్యాక్ డ్రాప్ కూడా చాలా కొత్తగా అనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ మూవీ 'జవాన్' అవుతుందని చెప్పవచ్చు ట్రైలర్ చూస్తుంటే. తమన్ నేపథ్య సంగీతం అందించారు ఈ సినిమాకి. సినిమా డిశంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.