మెగా ప్రిన్స్‌కి తృటిలో తప్పిన ప్రమాదం.!

By iQlikMovies - June 13, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కి గురయ్యింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో వరుణ్‌తేజ్‌ క్షేమంగా బయటపడ్డారు. రువనపర్తి జిల్లా, కొత్తకోట మండలం రాయని పేట వద్ద హైవేపై వరుణ్‌ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లూ తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కానీ, వరుణ్‌తో పాటు, కారులో ప్రయాణిస్తున్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. హైద్రాబాద్‌ నుండి బెంగుళూర్‌కి షూటింగ్‌ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వాహనం దెబ్బ తినడంతో మరో వాహనంలో వరుణ్‌తేజ్‌ బెంగుళూర్‌కి వెళ్లారు.

 

అక్కడికి చేరుకున్నాక ట్విట్టర్‌లో ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలిపి, తాను, తనతో పాటు ఉన్న నటులంగా క్షేమంగా ఉన్నామనీ, ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని తెలిపారు. ఈ విషయం తెలుసుకుని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తున్నాడనీ సమాచారమ్‌. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'జిగర్తాండ'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS