రజనీకాంత్‌ తర్వాత ఆ క్రెడిట్‌ అంజలిదే..!

మరిన్ని వార్తలు

అదేంటీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎక్కడా.? తెలుగమ్మాయి అంజలి ఎక్కుడా.? ఏంటీ.. ఎందుకు..ఈ పోలికా.? అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వచ్చేద్దాం. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'రోబో 2.0'ని స్టీరియోస్కోపిక్‌ టెక్నాలజీతో రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే టెక్నాలజీతో తెలుగమ్మాయ్‌ అంజలి నటించిన 'లిసా' చిత్రం కూడా తెరకెక్కింది. హారర్‌ త్రీడా కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ 'లిసా' చిత్రం ఇటీవలే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇంతవరకూ ఇలాంటి కథా చిత్రంలో టెక్నికల్‌గా ఇంత వేల్యుబుల్‌ మూవీలో అంజలి నటించలేదు. 

తొలిసారి ఈ తరహా టెక్నికల్‌ మూవీలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని అంజలి చెబుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా తమిళ వెర్షన్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. లేటెస్టుగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ 'లిసా' ట్రైలర్‌ చూసి మెచ్చుకున్నారు. టెక్నికల్‌గా హై వేల్యూస్‌తో హారర్‌ మూవీస్‌ని చాలా ఈజీగా తెరకెక్కించేసే రామ్‌గోపాల్‌ వర్మ అంజలి నటించిన 'లిసా' సినిమాకి బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఇవ్వడం ఆశ్చర్యమే. 

తెలుగు, తమిళ భాషల్లో 'లిసా' విడుదల కానుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ క్యూట్‌గా, నాటీగా చూసిన అంజలి 'లిసా'గా ఇప్పుడు ఘాటుగా భయపెట్టేయనుంది మరి. రాజు విశ్వనాధం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS