హాట్‌ హాట్‌ అమీ 'రోబో' గ్లామర్‌ యమ్మీ.!

మరిన్ని వార్తలు

బ్రిటీష్‌ బ్యూటీ అమీజాక్సన్‌ గ్లామర్‌ ఒలకబోయడంలో హద్దులేమీ లేవు. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళంలోనూ విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టింది. తెలుగులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'ఎవడు' సినిమాలో ఓ గెస్ట్‌ రోల్‌ పోషించింది. ఇలా అన్ని భాషల్లోనూ ఎంతో కొంత సత్తా చాటుతోన్న ఈ బ్యూటీకి సూపర్‌ స్టార్‌తో లేడీ రోబోగా నటించే సూపర్‌ ఛాన్స్‌ దక్కింది '2.0' సినిమాతో.

ఆ ఛాన్స్‌ని చక్కగా వినియోగించుకున్నానంటోంది అమీజాక్సన్‌. డైరెక్టర్‌ శంకర్‌కి హీరోయిన్స్‌ని అందంగా చూపించడంలో ప్రత్యేక శైలి ఉంది. శంకర్‌ సినిమా అయిన 'ఐ'లో అమీ జాక్సన్‌ అందాలకు ఆకాశమే హద్దు అనేలా చూపించాడు. అలాగే '2.0' కీ అమీజాక్సన్‌ అందచందాలు మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ కానున్నాయట. 

సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో 2.0 నుండి ఒక్కో ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌ బయటికి వస్తోంది. అందులో భాగంగా బయటికి వచ్చిన ఈ లేడీరోబో పోస్టర్‌ చూస్తున్నారుగా. రోబోగా టాప్‌ టూ బోటమ్‌ హెవీ మేకప్‌ ఉన్నప్పటికీ, గ్లామర్‌ మాత్రం మిస్‌ కాకుండా హాట్‌ హాట్‌ క్లీవేజ్‌ సొగసులతో కిర్రాకు పుట్టించేస్తోందీ అందాల అమీజాక్సన్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS