పదహారణాల తెలుగమ్మాయి అంజలి. అందం, అనకువ, ఎలాంటి పాత్రనైనా డీల్ చేయగల టాలెంట్ ఈ ముద్దుగుమ్మలో ఉన్నప్పటికీ తెలుగులో అవకాశాలు అంతంత మాత్రమే. అయితే తమిళంలో స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఈ విషయం పక్కన పెడితే, అంజలి ఈ మధ్య కాస్త బొద్దుగా మారింది.
దాంతో అమ్మడికి యంగ్‌స్టర్స్ పక్కన చోటు దక్కడం లేదట. సీనియర్ హీరోయిన్స్ అయిన నయనతార, శ్రియ, కాజల్ తదితర ముద్దుగుమ్మలు స్టార్ హీరోస్‌తో పాటు, యంగ్ హీరోస్ పక్కన కూడా నటించేస్తున్న ఈ తరుణంలో వారితో పోల్చితే అంజలి మాత్రం ఆ తరహా జోరు ప్రదర్శించలేకపోతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ కొత్త ప్లాన్ వేసిందట. అందులో భాగంగానే నైపుణ్యం గల ఫిట్‌నెస్ ట్రైనర్‌ని పెట్టుకుని కొంచెం బరువు తగ్గిందట. బరువు తగ్గిన అంజలి ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.
అసలింతకీ ఈ ఫోటోల్లో ఉన్నది అంజలియేనా? లేక ఎవరైనా కొత్త భామనా? అని ఆశ్చర్యపోయేంతలా ఆ ఫోటోలు ఉండడంతో, అంజలి పాప ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇలా నాజూగ్గా మారిన అంజలిని చూస్తే, అసలిప్పుడే ఫ్రెష్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్తమ్మాయిలా కనిపిస్తోంది. నిజంగానే యంగ్‌స్టర్స్‌కి జోడీగా ఈ బ్యూటీ భలే ఉంటుందే అనే ఆలోచన దర్శక, నిర్మాతలకు తట్టేలా కనిపిస్తోంది. దాంతో అంజలి వయసు బాగా తగ్గిపోయిందే అనే కామెంట్లు వస్తున్నాయి.
చూడాలి మరి కష్టపడి నాజూగ్గా మరింత అందంగా మారిన అంజలికి ఇకపై హాట్ హాట్ ఆఫర్స్ దక్కుతాయేమో.