ప్రభాస్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా?

By iQlikMovies - May 02, 2018 - 18:36 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మధ్యనే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసేందుకు యూనిట్ దుబాయ్ కి వెళ్ళింది.

అయితే ఇప్పుడు అక్కడ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ నుండి ఒక స్టిల్ లీక్ అయింది. ఆ స్టిల్ లో ఒక రేసర్ బైక్ ని నడిపే సన్నివేశంలో ప్రభాస్ నటిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఇక్కడ ఈ షూటింగ్ కి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

 

అవేంటంటే- 60 రోజుల పాటు సాగే ఈ దుబాయ్ షెడ్యూల్ కి సుమారు రూ 90కోట్ల మేర బడ్జెట్ ఖర్చు చేయనున్నట్టుగా తెలిసింది. దీనితో ఈ షెడ్యూల్ లో ఎంత భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అన్నది ఊహించవచ్చు.

ఇక ఈ చిత్రం బడ్జెట్ మొత్తం రూ 300 కోట్లు అని అంచనాలు వేస్తున్న తరుణంలో ఇలాంటి ఒక వార్త ఆ బడ్జెట్ ని సమర్ధించేలానే ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS