థాయ్‌లాండ్‌లో తెలుగమ్మాయ్‌.!

By iQlikMovies - October 25, 2018 - 15:55 PM IST

మరిన్ని వార్తలు

అందం, అభినయానికి పెట్టింది పేరు మన తెలుగు ముద్దుగుమ్మలు. కానీ దురదృష్టమేంటంటే తెలుగు సినిమాల్లో వీరికి ఆదరణ అంతగా దక్కదు. కానీ తమిళ తంబీలకు మన తెలుగమ్మాయిలంటే కూసింత అభిమానం ఎక్కువే. అందుకే టాలీవుడ్‌లో వీరి హవా అంతంత మాత్రమే అయినా కానీ, కోలీవుడ్‌లో మాత్రం దుమ్ము దులిపేస్తుంటారు. 

ఇక అసలు వివరాల్లోకి వెళితే, పదహారణాల తెలుగమ్మాయి అంజలి పేరు ఈ మధ్య అస్సలు తెలుగులో వినిపించడం లేదు. అప్పుడెప్పుడో బాలయ్య సరసన ఓ సినిమాలో కనిపించింది. అల్లు అర్జున్‌ సరసన బ్లాక్‌ బాస్టర్‌ అంటూ ఐటెం సాంగ్‌లో చిందేసింది. ప్రస్తుతం మరో సినిమాలో కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోందీ ఆంధ్రా ముద్దుగుమ్మ. తమిళ ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతితో అంజలి ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ కోసం థాయ్‌లాండ్‌లో అడుగుపెట్టింది అంజలి. 

40 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో జరిగే లాంగ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌లో అంజలి పాల్గొననుంది. షూటింగ్‌ నుండి ఖాళీ దొరికితే థాయ్‌లాండ్‌ అందాల్ని ఎంజాయ్‌ చేస్తానంటోంది ముద్దుగుమ్మ అంజలి. అక్కడి మంచి సైట్‌ సీయింగ్స్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఫుల్‌ జోష్‌గా గడిపేయనుంది అంజలి. కొంచెం బొద్దుగా మారిన అంజలి ఈ మధ్య స్లిమ్‌గా మరింత అందంగా మారి, స్పెషల్‌ ఫోటో సెషన్స్‌ చేయించుకుని కాస్త పబ్లిసిటీ స్టంట్‌ చేసింది. 

కానీ ఆ పబ్లిసిటీ ఎంత మాత్రమూ యూజ్‌ అయినట్లు లేదు. కోలీవుడ్‌ దాటి టాలీవుడ్‌లో అంజలి హవా కనిపించడం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS