ఈ టైటిల్ చూసి కాజల్ కి పెళ్ళయిపోతుందేమో అని కంగారు పడకండి.
తన పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపు తన అభిమానులతో ట్విట్టర్ లో ముచ్చటిచ్చింది. అందులో ఒక అభిమాని ఈమధ్య కాలంలో నచ్చిన సినిమాలు ఏంటి అని అడగగా- వెంటనే విజయ్ - రితు వర్మలు నటించిన పెళ్లి చూపులు అని చెప్పేసింది.
అవును మరి పెళ్లి చూపులు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. దానికి అధికారిక రుజువుగా మొన్ననే ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు ఎంపిక అవ్వడమే.
సో.. పెళ్లి చూపులు చిత్రం కామన్ ఆడియన్స్ నే కాకుండా సెలెబ్రిటీలను సైతం మెస్మరైజ్ చేసేసింది.