నందమూరి బాలకృష్ణ కథానాయిక కోసం బోయపాటి శ్రీను అన్వేషణ దాదాపు ముగిసినట్టే. బాలయ్య కోసం బోయపాటి శ్రీను ఓ హీరోయిన్ని ఫిక్స్ చేసేశాడు. అవును... బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలవ్వలేదు. బాలయ్య పక్కన ఓ కథానాయిక కోసం చిత్రబృందం చాలా రోజుల నుంచీ అన్వేషిస్తోంది.
రాశీఖన్నా, కీర్తి సురేష్, శ్రియ, నయనతార... ఇలా చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే వాళ్లెవరూ అందుబాటులో లేకపోవడంతో చివరికి రాజోలు పాప... అంజలిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బాలయ్య - అంజలి ని ఇది వరకు డిక్టేటర్లో చూసేశారు బాలయ్య అభిమానులు. అంజలి గనుక హీరోయిన్ పాత్రకు ఫిక్సయితే... ఈజోడీ రెండోసారి చూసినట్టు అవుతుంది. స్టార్ హీరోయిన్లు ఎవరూ అందుబాటులో లేకపోవడం, కథానాయిక కోసం పెద్దగా బడ్జెట్ లేకపోవడంతో అంజలికే ఓటేసినట్టు తెలుస్తోంది.