వినాయ‌క్ పై అది రూమ‌ర్ మాత్ర‌మే.. నిజం ఏమిటంటే..?

మరిన్ని వార్తలు

ఇంటిలిజెంట్ త‌ర‌వాత వినాయ‌క్ మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసినా ఏదీ క‌ల‌సి రాలేదు. క‌థ సెట్ కాక‌పోయే స‌రికి... ఆ ప్ర‌య‌త్నం ఆపేశాడు. అయితే అనూహ్యంగా వినాయ‌క్ మేక‌ప్ వేసుకోవాల్సివ‌చ్చింది. `శీన‌య్య‌` పేరుతో దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా మొద‌ల‌య్యే స‌రికి.. చిత్ర‌సీమ షాక్‌కి గురైంది. ఈ వ‌య‌సులో వినాయ‌క్ హీరో ఏమిటి? అనుకున్నారు. కానీ చూస్తుండ‌గానే సినిమా మొద‌లైపోయింది. అయితే అంత‌లోనే ఆగిపోయింది.

 

ఈ సినిమా క‌థ విష‌యంలో అటు దిల్ రాజు, ఇటు వినాయ‌క్ ఇద్ద‌రూ అసంతృప్తితో ఉన్నార‌ని, అందుకే ఈ సినిమా ఆపేశార‌ని, ఇక ప‌ట్టాలెక్క‌ద‌ని వార్త‌లొచ్చాయి. వినాయ‌క్ కూడా మ‌ళ్లీ డైరెక్ష‌న్‌పై ఫోక‌స్ చేస్తున్నాడ‌ని చెప్పుకున్నారు. అయితే ఇదేం నిజం కాద‌ని తేలిపోయింది. `శీన‌య్య‌` ఆగిపోలేదు. మ‌ళ్లీ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈనెలాఖ‌రు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు. ఇక నుంచి సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమా పూర్తి చేస్తార‌ని స‌మాచారం. క‌థ‌లో కొన్ని అనుమానాలు ఉన్న‌ప్ప‌టికి, వాటిని ఇప్పుడు నివృత్తి చేసుకున్నార‌ట‌. అన్ని ర‌కాలుగా సంతృప్తిప‌డిన త‌ర‌వాతే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని దిల్ రాజు డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. సో.. శీన‌య్య టెన్ష‌న్ తీరిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS