అంజలికి అన్నీ ఆ పాత్రలే వస్తున్నాయా?

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయి అంజలికి తెలుగులో సరైన ఆదరణ దక్కకపోయినా, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గానే వెలుగొందుతోంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా అంజలి హవా తగ్గింది. దాంతో తెలుగు సినిమాలపై కూడా అంజలి మళ్లీ దృష్టి పెట్టింది. ఆ దిశగానే అంజలి కాస్త ఒళ్లు తగ్గించి నాజూగ్గా మారింది. 

తెలుగులో అవకాశాల సంగతి పక్కన పెడితే, మళ్లీ తమిళంలోనే ఓ మంచి ఆఫర్‌ కొట్టేసింది అంజలి. సినిమాటోగ్రాఫర్‌ ముత్తయ్య నిర్మాణంలో 'లిసా' అనే ఓ సినిమా తెరకెక్కుతోంది. రాజు విశ్వనాధం అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'లిసా' పాత్రలో అంజలి నటిస్తోందీ సినిమాలో. ఈ సినిమాలో అంజలి దెయ్యం పాత్రలో కనిపించనుంది. అయితే ఇంతవరకూ వచ్చిన హారర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందట. 

తెలుగులో అంజలి దెయ్యం పాత్రలో కనిపించిన 'గీతాంజలి' చిత్రం మంచి విజయం అందుకుంది. ఆ తరహాలోనే ఇటీవల తమిళంలో 'బలూన్‌' అనే హారర్‌ చిత్రంలోనూ అంజలి నటించింది. తాజాగా విజయ్‌ ఆంటోనీ నటించిన 'కాశీ'లో ట్రెడిషనల్‌ అమ్మాయిగా కనిపించింది. అయితే తాజాగా అంజలి నటిస్తున్న 'లిసా' చిత్రంలో ఆమె పాత్ర తనకెంతో నచ్చి, మెచ్చి చేస్తున్నానంటోంది అంజలి. అలాగే అందరికీ నచ్చుతుందంటోంది. 

అంజలి మంచి నటి. ఎలాంటి పాత్రనైనా డీల్‌ చేయగల సత్తా ఉంది. అయినప్పటికీ తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోకపోయినా, గ్లామర్‌ పాత్రలకు దూరంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరగా మంచి స్థానం సంపాదించుకుంది అంజలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS