ఎన్టీఆర్ బయోపిక్ గురించిన ఆసక్తికర వివరాలు

By iQlikMovies - May 23, 2018 - 15:12 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ గురించిన ఏదో ఒక అంశం ఆ చిత్రం మొదలైన నాటి నుండి ప్రజల్లో నానుతూనే ఉంది. ఈ సమయంలోనే ఆ చిత్రం నుండి ఏకంగా దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోయినట్టేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఎట్టకేలకి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళే దర్శకుడు దొరికాడు. ఆయనే దర్శకుడు క్రిష్. ఆయన తీస్తున్న మణికర్ణిక చిత్రం అయిపోగానే ఈ చిత్రాన్ని మొదలుపెడతాడు. అయితే ఈ చిత్రాన్ని చిత్రీకరించే అంశంలో కొన్ని కీలక మార్పులు జరిగాయి.

అవేమనగా- ఈ చిత్రాన్ని రెండు భాగాల్లో తీద్దాము అనుకున్న వారు ప్రస్తుతం ఒక్క భాగంతోనే పూర్తి కథని చిత్రీకరిద్దాము అని అనుకుంటున్నారు అట. కారణం- దర్శకుడు క్రిష్ ఒక్క పార్ట్ అయితేనే తాను తెరకేక్కించగలను అని చెప్పడమే అట.

ఇక ఈ చిత్రం లో ఎన్టీఆర్ బాల్యం నుండి ఆయన రాజకీయ ప్రయాణంలో నాదెండ్ల బాస్కర రావు ఉదంతం వరకు ఈ చిత్రం లో చూపించనున్నట్టుగా సమాచారం. ఇక తరువాతి అంశాలు ఈ చిత్రంలో ఉండబోవు అని తెలుస్తున్నది.

ఏదైతేనేమి... ఎన్టీఆర్ బయోపిక్ మళ్ళీ పట్టాలెక్కనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS