రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'కి సంబంధించి తాజాగా ఓ ముచ్చట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, 'డియర్ కామ్రేడ్' సినిమా డైరెక్షన్‌లో మన కామ్రేడ్ వేలు పెట్టాడట. వేలు పెట్టడమే కాదు, అసలు డైరెక్టర్‌కి ఛాన్సే ఇవ్వలేదనీ, సినిమా మొత్తం తనకు ఎలా కావాలో అలా చేయించుకున్నాడనీ, సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ, తన డైరెక్షన్‌లోనే చేయాల్సి వచ్చిందనీ గాసిప్ ప్రచారంలో ఉంది.
భరత్ కమ్మ కొత్త దర్శకుడు కావడంతో, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌ని కెలికి కెలికి వదిలిపెట్టాడట. చాలా రీషూట్స్ జరిగాయట. కానీ, ఇదంతా ఉత్తిదే అంటూ మరోవైపు మౌత్ టాక్ వినిపిస్తోంది. అయినా ఈ మధ్య సినిమాల్లో స్టార్‌డమ్ ఉన్న హీరోల విషయంలో ఈ కెలుకుడు వ్యవహారం బాగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకడే. జబర్దస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. సో ఇలాంటి గాసిప్స్ ఆయన విషయంలోనూ సహజమే. అయితే, ఇవన్నీ జస్ట్ గాసిప్స్ మాత్రమే.
విజయ్ దేవరకొండ అంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారమే అంటున్నారు ఇంకొంతమంది. నిజంగానే ఇది దుష్ప్రచారమా.? లేక నిజమేనా.? తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. 'డియర్ కామ్రేడ్' ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించింది.