కన్నడ చిత్రం 'కేజీఎఫ్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లని అందుకుంది. ఇప్పుడు 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. సంజయ్‌దత్ లాంటి నటుల్ని తీసుకోవడంతో ఈ సినిమాకి స్టార్ వాల్యూ కూడా వచ్చేసింది. తాజాగా రవీనాటాండన్కీ ఓ మంచి పాత్ర దక్కినట్టు తెలుస్తోంది. ఎమర్జన్సీ నేపథ్యంలో నడిచే కథ ఇది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలున్నాయి.
ఆ పాత్రకుగానూ రవీనాని తీసుకున్నారట. తెలుగు నుంచి రావు రమేష్‌కి ఓ మంచి పాత్ర దక్కింది. యష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. తొలి భాగం ఏకంగా 250 కోట్లు సాధించింది. ఓ కన్నడ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం కన్నడ చలన చిత్రపరిశ్రమలో ఇదే తొలిసారి. అందుకే చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకున్నాయి. అందుకు తగ్గట్టే విడుదలకు ముందే ఈ సినిమా మంచి రేట్లకు అమ్ముడుపోతోంది. రెండో భాగం కూడా దాదాపుగా 250 కోట్లు సాధించే అవకాశాలున్నాయని అక్కడి ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. కేజీఎఫ్ మరోసారి చరిత్ర సృష్టించినట్టే.