నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ చిత్రం కోసం వేసిన సెట్ కాలిపోయిన సంగతి విదితమే.
అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నాగార్జున, కారణాలు ఇంకా తెలియాల్సిఉంది అని చెబుతూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపాడు.
ఇంకా ఆస్తినష్టం ఎంత జరిగి ఉండొచ్చు అని అడగగా, ఆ వివరాలు ఇంకా తెలియదు అని అయితే మంటలు పక్క సెట్స్ కి వ్యాపించాకపోవడం అదృష్టం అని పేర్కొన్నారు.
ఇక ఈ ప్రమాదానికి కారణంగా షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నారు.