హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే ఇషా గుప్తా ఇప్పుడు కొంచెం కొత్తగా ఆలోచించింది. అయితే ఆమె ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆసుపత్రిలో ఉంటేనేమి. తన అభిమానులు తన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అనుకుందో ఏమో కానీ ఆసుపత్రి బెడ్‌పైనా ఫోటోలకు పోజిచ్చేసింది.
అయితే చూసే వాళ్ల అదృష్టం ఏంటంటే ఇక్కడ అమ్మడు ఎక్స్‌పోజింగ్ చెయ్యలేదులెండి. చేతికి సెలైన్ పెట్టి ఉంది. కానీ కళ్లకి గాగుల్స్ పెట్టుకుని స్వీట్‌గా స్మైల్ ఇస్తూ స్టైల్‌గా ఫోటోకి పోజిచ్చి, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'త్వరగా కోలుకుంటాను.. ధన్యవాదాలు..' అంటూ హ్యాష్ టాగ్ కూడా పోస్ట్ చేసింది. అయితే ఇషాకి ఫోటో సెషన్ అంటే పిచ్చే కానీ, మరీ ఇంతగానా అని నెటిజన్లు ఆశ్చర్యపోక తప్పలేదు. అయితే స్మాల్ ఛేంజ్ ఏంటంటే, ఇషాకి హాట్ హాట్ ఫోటో సెషన్ అంటేనే ఇష్టం. అలాంటిది ఇలాంటి సిట్యువేషన్‌లోనూ ఫోటోలు దిగాలని అనిపించిందే అది కొంచెం కొత్తగా ఉంది. అయితే ఈ బ్యూటీ హాట్ హాట్ పిక్స్‌కి ఫాలోవర్స్ అయిన నెటిజన్లు మాత్రం ఈ బ్యూటీ ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు.
ఏది ఏమైనా సమ్‌థింగ్ స్పెషల్ చేసి, ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉండాలనేదే ఇషా ఆటిట్యూడ్. అందుకే ఇలా చేసింది. ఎప్పుడూ హాట్‌నెస్సే చూపిస్తే కిక్కేముంటుంది. అప్పుడప్పుడూ ఇలా కూడా అంటోంది అందుకే. తన శృతిమించిన హాట్‌నెస్ విషయమై ఎన్నిసార్లు వివాదాలు తలెత్తినా, ఈ ముద్దుగుమ్మ అవేమీ పట్టించుకోకుండా, మరింత శృతి మించిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ సారి మాత్రం ఆరోగ్యం బాగా లేని కారణంగా ఇలా దర్శనమివ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఇషా గుప్తా అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ వైరలే.