‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి మరో తలనొప్పి!

మరిన్ని వార్తలు

మెగా మల్టీ స్టారర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి మరో చిక్కొచ్చి పడిరది. ఈ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటిస్తున్న ముద్దుగుమ్మ అలియాభట్‌ పెళ్లి చేసుకోబోతోందట అనే గాలి వార్త పెద్ద దుమారం రేపుతోంది. ఈ మధ్యనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ రాజమౌళి చేసిన ప్రకటన ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

తాజాగా అలియాభట్‌ పెళ్లి వార్త మరింత కవరపెడుతోంది. మరోవైపు తూచ్‌.. అలాంటిదేం లేదంటూ అలియా భట్‌ ఈ వార్తను ఖండిస్తున్నా, డబుల్‌ తూచ్‌.. అంతా నిజమే, రణ్‌వీర్‌ కపూర్‌తో అలియా భట్‌ వివాహం ఫిక్సయ్యిందనీ, పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటూ పుకారు షికారు చేస్తోంది. గత కొన్నేళ్లుగా రణ్‌వీర్‌ కపూర్‌తో అలియా భట్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించిందనీ, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

 

అయితే, వెరీ లేటెస్ట్‌గా సర్క్యులేట్‌ అవుతున్న ఈ గాలి వార్త మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌కి ఇదో కొత్త తలనొప్పిగానే భావించాలి. రామ్‌చరణ్‌కి జోడీగా సీత పాత్రలో అలియా భట్‌ నటిస్తోంది. ఎన్టీఆర్‌తో విదేశీ భామ ఒలివియా మోరిస్‌ జత కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS