మెగా హీరోతోనే భర్తీ చేస్తారట...

By Gowthami - April 07, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

'ఆచార్య‌'లో రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నాడోచ్‌.. అని సంబ‌ర ప‌డిన మెగా ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు చిరంజీవి. 'ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఉంటే ఉంటాడు, లేదంటే లేదు' అని చెప్పి కొత్త క‌న్‌ఫ్యూజ‌న్ సృష్టించాడు. నిజానికి ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఎంట్రీ గురించి ఎవ్వ‌రికీ ఎలాంటి అనుమానాలూ లేవు. త్వ‌ర‌లో చ‌ర‌ణ్ ఎంట్రీ ఖాయం అని రిలాక్స్ అయిపోయారు. కానీ... ఈ క‌థ‌కి కొత్త ట్విస్టు ఇచ్చాడు చిరు. మ‌హేష్ పేరు అస‌లేమాత్రం అనుకోలేద‌ని, ఓ కీల‌క‌మైన పాత్ర‌నిచ‌ర‌ణ్ చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నామ‌ని, కానీ చ‌ర‌ణ్ డేట్లు ఇవ్వ‌డం అంత తేలిక కాద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తేల్చేశాడు చిరు.

 

మ‌హేష్ కాదు, చ‌ర‌ణ్ కూడా కాక‌పోవొచ్చు అంటే.. ఈ పాత్ర‌కు మ‌రో ఆప్ష‌న్ ఉన్న‌ట్టే క‌దా? `ఆచార్య‌`లో క‌థ ప్ర‌కారం ఫ్లాష్ బ్యాక్ లో ఓ బ‌ల‌మైన పాత్ర ఉంది. ఆ పాత్ర ఈ క‌థ‌కు చాలా కీల‌కం. ఆ పాత్ర‌లో ఓ పేరున్న న‌టుడే క‌నిపించాలి. చ‌ర‌ణ్ మంచి ఆప్ష‌న్‌. నూటికి 99 శాతం చ‌ర‌ణ్‌తోనే ఈ పాత్ర చేయించాల‌ని ప్లాన్‌. అది సాధ్యం కాని ప‌క్షంలో.. చ‌ర‌ణ్ స్థానంలో మ‌రో హీరోని చూసుకోవాల్సిందే. దానికి సంబంధించిన ఆప్ష‌న్లు కూడా కొర‌టాల శివ ద‌గ్గ‌ర సిద్ధంగా ఉన్నాయ‌ని స‌మాచారం. దాదాపుగా ఆ పాత్ర‌ని మ‌రో మెగా హీరోతోనే రీప్లేస్ చేసే అవ‌కాశాలున్నాయి. మ‌రి మెగా హీరోల్లో ఆ ఛాన్స్ కొట్టేదెవ‌రో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS