టీజర్ ఉద్దేశం టీజ్ చేయడం. ఒక ఆసక్తిని రేకెత్తించడం. ఈ రెండూ చేసింది నాని అంటే సుందరానికి టీజర్. నాని హీరోగా , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికీ’ టీజర్ బయటికి వచ్చింది చివర్లో ఫన్ తో పాటు సస్పెన్స్ ని బాగా మేంటైన్ చేశారు. ఇందులో అంటే .. మాటని చివరి వరకూ హుక్ చేసి వుంచారు. టీజర్ అంతా ఫన్ గా వుంది. చివర్లో అంటే .. ఏమిటో ఆడియన్స్ గస్సింగ్ కే వదిలేశారు.
ఇందులో నానిది బ్రహ్మణ అబ్బాయి పాత్ర. అతడు లీలా థామస్ అనే క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అంతేకాదు .. సుందరం పాత్రకు చాలా గండాలు వుంటాయి. వాటి కోసం పూజలు కూడా చేస్తున్నట్లు చూపించారు. మరి ఇందులో 'అంటే'.. అంటే ఏమిటో.. అసలు సుందరానికి వున్న సమస్య ఏమిటో అలోచించుకునే పని ఆడియన్ కే వదిలేశాడు దర్శకుడు. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో టీజర్ కంటే సినిమాలో పదింతల ఫన్ వుంటుందని ప్రామిస్ చేసి మరీ చెప్పాడు నాని. మరి సుందరం సరదాలు ఏమిటో తెలియాలంటే జూన్ 10వరకు ఆగాల్సిందే.