ఈవారం బాక్సాఫీసు దగ్గర హడావుడి బాగానే కనిపించింది. అంతరిక్షం, పడి పడి లేచె మనసు, కేజీఎఫ్, మారి 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే.. అందరి కళ్లూ అంతరిక్షం, పడి పడి లేచె మనసుపైనే ఉన్నాయి. పడి పడి లేచె మనసు తొలి రోజు రూ.1.7 కోట్ల వరకూ దక్కించుకుంది. అంతరిక్షంకీ మంచి వసూళ్లు దక్కాయి. తొలి రోజు ఈ సినిమా రూ.1.2 కోట్లు వసూళ్లు రాబట్టింది.
నైజాంలోనే రూ.50 లక్షల వరకూ వచ్చింది. ఈస్ట్, వెస్ట్‌లలో వసూళ్లు మరీ డల్‌గా ఉన్నాయి. `మల్టీప్లెక్స్ సినిమా` అని ముద్ర పడడం వల్ల... బీ, సీల్లో ఈ చిత్రానికి ఆశించినంత వసూళ్లు రాలేదు. చివరి నిమిషంలో పంపిణీదారులు హ్యాండ్ ఇవ్వడంతో దాదాపు గా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాని సొంతంగానే విడుదల చేశారని సమాచారం. శుక్రవారం ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల అవ్వడం.. అంతరిక్షం వసూళ్లపై ప్రభావం చూపించింది. ఏ క్లాస్, మల్టీప్లెక్స్ ప్రేక్షకులే ఈ సినిమాకి శ్రీరామ రక్ష. శని, శుక్రవారాలలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి.