ఆ విషయంలో అనూనే టాప్‌

మరిన్ని వార్తలు

చిన్న సినిమాలతో కెరీర్‌ స్టార్ట్‌ చేసి, తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ దిశగా పరుగులు పెడుతోన్న బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌. తక్కువ టైంలోనే స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ వైపు దూసుకొస్తోందీ ముద్దుగుమ్మ. తెలుగు దర్శక, నిర్మాతలకు, హీరోలకు ప్రస్తుతం ఈ బ్యూటీనే మొదటి ఆప్షన్‌గా నిలిచింది. 

సినిమాల సంగతి పక్కన పెడితే, షో రూమ్‌ ఓపెనింగ్స్‌కి కూడా అమ్మడు పేరే లిస్టులో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటోందట. అంతలా అనూ ఇమ్మాన్యుయేల్‌కి పాపులారిటీ ఉందిప్పుడు. షో రూమ్‌ ఓపెనింగ్స్‌కి భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకుంటోందట ఈ అందాల తార అనూ ఇమ్మాన్యుయేల్‌. ఓ పక్క సినిమాలతోనూ, మరో పక్క షోరూమ్‌ ఓపెనింగ్స్‌తోనూ ఫుల్‌ బిజీగా గడిపేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏ షో రూమ్‌ ఓపెన్‌ చేసినా, షాపింగ్‌ మాల్‌ ఓపెన్‌ చేసినా ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌నే ముందుగా సంప్రదిస్తున్నట్లు సమాచారమ్‌. భారీ రెమ్మునరేషన్‌ ఆఫర్‌ చేసి మరీ అనూని ఆహ్వానిస్తున్నారట షో రూమ్‌ యజమానులు. 

పాపులారిటీలో ఉన్న ముద్దుగుమ్మలతో షాపింగ్‌ మాల్స్‌ ఓపెన్‌ చేయించడం ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం. 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అనూ ఇమ్మాన్యుయేల్‌, ఇప్పుడు వరుసగా స్టార్ట్‌ హీరోల సరసన చోటు దక్కించుకుంటోంది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో అనూ ఇమ్మాన్యుయేల్‌ నటించిన 'అజ్ఞాతవాసి' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్యతోనూ అనూ ఓ సినిమాలో నటిస్తోంది. 

ఇలా క్షణం తీరిక లేకుండా, సినిమాలతో బిజీగా ఉంటూనే, రిబ్బన్‌ కటింగ్స్‌కి కూడా కాస్త టైం స్పెండ్‌ చేస్తోంది. ఇటీవలే ఓ మొబైల్‌ కంపెనీ ఓపెనింగ్‌కి అనూ ఇమ్మాన్యుయేల్‌ విచ్చేసింది. సినిమా న్యూస్‌ కాకుండా, ఈ తరహా న్యూస్‌తో కూడా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS