తల్వార్ అంటే పొడుగాటి కత్తి. పేరులోనే 'కత్తి'ని పెట్టుకున్న కత్తిలాంటి అందాల భామ ఇషా తల్వార్. 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషా తల్వార్, ఆ సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకున్నా సక్సెస్ క్రెడిట్ అంతా ఆ సినిమాలో మరో హీరోయిన్‌గా నటించిన నిత్యా మీనన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. నితిన్ హీరోగా నటించిన చిత్రమిది. ఇషా కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో చేసిన సినిమా 'రాజా చెయ్యి వేస్తే'లో కనిపించింది. ఆ సినిమా నిరాశపర్చడంతో ప్రస్తుతం మలయాళ, హిందీ సినిమాలతో సరిపెట్టేసుకుంటోంది. ఛాన్స్ వస్తే మళ్ళీ తెలుగు తెరపై వెలిగిపోవాలనుకుంటోన్న ఈ బ్యూటీ, అవకాశాల కోసం ఇదిగో ఇలాంటి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏదేమైనా అందానికి కేరాఫ్ అడ్రస్ అన్పించేలా ఉందీ ఫోజ్. టూ పీస్ బికినీ, ఆ పై కాస్త 'కవరింగ్'. విల్లులా వంగి ఒంపు సొంపుల్ని ప్రదర్శనకు పెట్టిన ఈ కత్తిలాంటి బ్యూటీకి ఇంకో ఛాన్స్ ఇచ్చేదెవరట తెలుగులో!