టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న బ్యూటీలో ఒకరు ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. నానితో 'మజ్ను' సినిమాలో నటించి, తెలుగు ప్రేక్షకులకు పరచయం అయ్యింది ఈ బ్యూటీ. ఎక్స్‌పోజింగ్ విషయంలో తన విలువైన అభిప్రాయాల్ని ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పింది అనూ ఇమ్మాన్యుయేల్. ఎందకంటే ఈ మధ్య అమ్మడి ఎక్స్‌పోజింగ్ కంచెలు దాటేసింది. సో ఆ విషయంలో ముందుగానే జాగ్రత్త పడిపోయి, క్లారిటీ ఇచ్చేస్తోంది ఆడియన్స్‌కి. అందమే కాదు, అచ్చమైన గడుసుపిల్లే ఈ చిన్నది. సినిమాకి గ్లామర్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సో ఆ విషయంలో అబ్జెక్షన్స్ పెడితే, ఆడియన్స్‌ని మెప్పించలేము. అలాగనీ అభ్యంతరకరంగా ఎక్స్‌పోజింగ్ నేను చేయననీ చెబుతోంది. గ్లామరస్‌గా కనిపించడానికి అవసరమైన ఎక్స్‌పోజింగ్ అయితే చేస్తాను కానీ అసభ్యకరంగా ఉండే ఎక్స్‌పోజింగ్ చేయననీ చెబుతోందీ ముద్దుగుమ్మ. తొలి సినిమా 'మజ్ను'లో ఎక్స్‌పోజింగ్‌కి చోటు లేదు. క్యూట్‌గా అందంగా కనిపించింది. తర్వాతి సినిమా 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త'లో హాట్‌గానే కనిపించింది. యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో లిప్‌లాక్స్‌దాకా వెళ్లిందీ బ్యూటీ. ఆక్సిజన్‌లో మరింత హాట్‌గా కనిపిస్తోంది. ఇక పవన్‌కళ్యాణ్‌తో నటిస్తున్న సినిమాలో కూడా అమ్మడిది గ్లామర్ పాత్రే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూరప్‌లో ఎంజాయ్ చేస్తోంది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్.