అల్లు కాంపౌండ్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోదరుడు అల్లు శిరీష్‌ 'గౌరవం' సినిమాతో తెరంగేట్రం చేశాడు. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో హీరోగా సక్సెస్‌లు అందుకున్నాడు. 

ఇప్పుడీ యంగ్‌ హీరో మరో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌కి ప్లాన్‌ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. కథ దాదాపుగా ఓకే అయిపోయిందని సమాచారమ్‌. అల్లు శిరీష్‌ సరసన అనూ ఇమ్మాన్యుయేల్‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. 

అల్లు హీరో బన్నీతో ఇటీవలే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో నటించిందీ భామ. అంతకుముందు 'అజ్ఞాతవాసి'తో పెద్ద డిజాస్టర్‌ చవి చూసింది. దాని కన్నా ముందు 'ఆక్సిజన్‌' అనే మరో ప్లాప్‌ సినిమా కూడా అనూ ఇమ్మాన్యుయేల్‌ ఖాతాలో ఉంది. ఇంత బ్యాడ్‌ ట్రాక్‌ రికార్ట్‌ ఉన్న అనూ ఇమ్మాన్యుయేల్‌కి అవకాశాలు పోటెత్తుతుండడం ఆశ్చర్యకరమే. 

ఈ బ్యూటీ ప్రస్తుతం 'శైలజారెడ్డి' అల్లుడు సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకుంది అనూ ఇమ్మాన్యుయేల్‌. శిరీష్‌తో అనూ చేయబోయే సినిమాపై పూర్తి స్థాయిలో స్పస్టత రావాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS