బిగ్ బాస్ షో పై క్లారిటీ ఇచ్చిన శ్రీ రెడ్డి

By iQlikMovies - June 09, 2018 - 15:54 PM IST

మరిన్ని వార్తలు

సంచలనాలకి చిరునామాగా మారిపోయిన శ్రీ రెడ్డి మరోసారి తనదైన స్టైల్ లో టాలీవుడ్ లోని కొందరి పైన కామెంట్స్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నది.

ఇకపోతే గత కొద్దికాలం నుండి ఆమె హీరో నాని పైన కామెంట్స్ చేయడం అదే హీరో ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీ రెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనుంది అందుకోసమే ఆమె వైపు నుండి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న నాని టార్గెట్ చేయడం ఒక స్కెచ్ లో భాగం అని వార్తలు వచ్చాయి.

చివరికి ఆమె ఈ అంశం పైన స్పందించింది- 'బిగ్‌బాస్‌'లో పాల్గొనడం లేదు. పార్టిసిపెంట్స్ కి నా శుభాకాంక్షలు. 'బిగ్‌బాస్‌' బృందానికి ఆల్‌ ది బెస్ట్‌'. దీనితో శ్రీ రెడ్డి బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందా? ఉండదా? అనేదాని పైన ఉన్న అనుమానాలు తీరిపోయాయి.

ఇది శ్రీ రెడ్డి.. బిగ్ బాస్ ల ముచ్చట...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS