అనూ ఇమ్మాన్యుయేల్.. పేరు వినే వింటారు. అదృష్టం పట్టినట్లే పట్టి, పారిపోయిన అమ్మడు ఈ అమ్మడు. అంతవరకూ చిన్న హీరోల సరసన రొమాన్స్ చేసుకుంటూ, మెల్ల మెల్లగా కెరీర్ డెవలప్ చేసుకుంటూ పోతున్న ఈ ముద్దుగుమ్మకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూపంలో అదృష్ట దేవత వరించింది. అయితే, అదే ఆమె పాలిట దురదృష్టంగా మారుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు. ‘అజ్ఞాతవాసి’లో పవన్ సరసన రొమాన్స్‌కి కాలు దువ్విన ఈ బ్యూటీ తర్వాత అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటించింది. రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇక అక్కడితో ఆమె కెరీర్ అటకెక్కేసింది.
కోటి ఆశలతో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో నటించినా, గత రెండు చిత్రాల ఎఫెక్ట్ ఈ సినిమాపై బలంగా పడడంతో, చాలా కష్టమైపోయింది పాపకి గట్టెక్కడం. దాంతో ఆ తర్వాత అమ్మడితో సినిమా అంటేనే మేకర్లు భయపడిపోయారు. ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇదంతా టాలీవుడ్ పరిస్థితి. టాలీవుడ్ కాదన్నా, అనూని కోలీవుడ్ ఆదరించింది. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యనే మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిందనీ సమాచారం. ఈ సంగతిలా ఉంచితే, సోషల్ మీడియాలో అనూని ఫాలో చేసే వాళ్లు ఓ మోస్తరులో ఉన్నారు. అలాంటి వారి కోసం అప్పుడప్పుడూ ఇదిగో ఇలా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ శాటిస్‌ఫై చేస్తుంటుంది. చూస్తున్నారుగా, బ్రౌన్ కలర్ మోడ్రన్ వేర్‌లో అనూ ఎలా కవ్విస్తోందో.!