అనూ ఇమ్మాన్యుయేల్‌ ఎక్కడ?

By iQlikMovies - May 09, 2018 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

'సూర్య' ప్రమోషన్స్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌ ఎక్కడా కనిపించడం లేదు. 'రంగస్థలం' ప్రమోషన్స్‌లో సమంత మిస్‌ అయ్యింది. అయినా కానీ ఆ సినిమా ఘన విజయం సాధించింది. 'భరత్‌ అనే నేను' సినిమాకి కైరా అద్వానీ ప్రమోషన్స్‌ బాగా చేసింది. సినిమా ప్రమోషన్స్‌కి హీరోయిన్స్‌ అప్పియరెన్స్‌ వెరీ వెరీ ఇంపార్టెంట్‌. 

కానీ 'నా పేరు సూర్య' సినిమా ప్రమోషన్స్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌ కనిపించడం లేదు. విడుదలకు ముందు సినిమా ఆడియో వేడుకలో సూపర్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో మెరిసిపోయింది. కానీ ఆ తర్వాత ఎక్కడా అనూ జాడే లేదు. ఎందుకో. ఒకవేళ తన నెక్ట్స్‌ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉందా? అంటే అది కూడా లేదు. ఆమె చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్టులున్నాయి. రవితేజతో ఓ సినిమాలో నటిస్తోంది అనూ ఇమ్మాన్యుయేల్‌. మారుతి డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం మరోటి. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. సో అంత బిజీయెస్ట్‌ షెడ్యూల్స్‌ ఏమీ అనూ చేతిలో లేవని తెలుస్తోంది. అలాంటప్పుడు ఎందుకు సూర్య ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదు. 

మరో పక్క 'మహానటి' సినిమా కోసం బీభత్సంగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఓ పక్క కీర్తి సురేష్‌ టీవీ ఛానెల్స్‌లో ట్రెడిషనల్‌ వేర్‌లో ఇంటర్వ్యూలిస్తూ మెరిసిపోతోంది. కీర్తితో పాటు, సమంత కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. 'రంగస్థలం' సమయంలో సమంత వెకేషన్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్న కారణంగా ప్రమోషన్స్‌కి హాజరు కాలేకపోయింది. కానీ ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో సమంతకి అది పెద్ద ప్లస్‌ అయ్యింది. 

కానీ 'సూర్య' మిశ్రమ టాక్‌తో రన్‌ అవుతోంది. వన్‌ మేన్‌ షో అంటూ క్రెడిట్‌ మొత్తం బన్నీకే వెళ్లిపోయింది. ఈ తరుణంలో అనూ ప్రమోషన్స్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం లేదనుకుంటోంది కాబోలు.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS