మరో సంచలన బయోపిక్ లో కీర్తి సురేష్

By iQlikMovies - May 08, 2018 - 18:55 PM IST

మరిన్ని వార్తలు

కీర్తి సురేష్- ఇప్పుడు ఈ పేరు అంటే ఒక అద్బుతమనే చెప్పాలి. దీనికి కారణం ఆమె మహానటి చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో నటించడమే..

ఇక ఇప్పుడు ఆమె మరో సంచలనాత్మక బయోపిక్ లో ఆమె నటించబోతున్నది అని తాజాగా వినిపిస్తున్న రూమర్. ఆ రూమర్ ప్రకారం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి నటి జయలలిత జీవితాన్ని ఆధారం చేసుకుని తీయబోయే బయోపిక్ లో ప్రధాన పాత్రలో కీర్తి సురేష్ నటించనుందట.

అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఏమి బయటకి రాకపోయినప్పటికీ ఈ వార్త ఇప్పుడు తమిళనాట హల్చల్ చేస్తున్నది. ఇదిలావుండగా మహానటి చిత్రం రేపు విడుదల కానున్న సందర్భంలో మాత్రం అందరి దృష్టి సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ పైనే నెలకొని ఉంది.

చూద్దాం.. సావిత్రి చేసిన కీర్తికి మరో అద్బుతమైన మనిషి అయిన జయలలిత పాత్రని చేస్తుందా లేదా?

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS