మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తరువాత దర్శకుడు శ్రీను వైట్ల తో కలిసి చేస్తున్న చిత్రం- అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమాన్యుల్ ని ముందుగా ఎంపిక చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఆ చిత్రం నుండి ఆమె తప్పుకుంది.
ఒక్కసారిగా ఈ విషయం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి గల కారణాలని అటు నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ అలాగే నటి అను ఇమాన్యుల్ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి- అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కోసం అమెరికాలో దాదాపుగా ఒక 50 రోజుల పాటు ఒక పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఎకదాటిన 50 రోజుల పాటు ఇలా ఈ చిత్రానికి కేటాయించలేకపోయింది అను. ఎందుకంటే- నాగ చైతన్య ఆమె చేస్తున్న శైలజ రెడ్డి అల్లుడు సినిమాకి ఈ డేట్స్ ఇచ్చేయడమే దీనికి ముఖ్య కారణమట.
ఇదే విషయాన్నీ అను తన ట్విట్టర్ లో వివరించింది. అయితే ఈమె స్థానంలో ఇలియానాని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కాని దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.