తొలి సినిమా 'మజ్ను'లో అనూ ఇమ్మాన్యుయేల్ కాస్త నార్మల్‌గా కనిపించింది. మీడియమ్ ట్రెండీ గాళ్‌గా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతీ సినిమాలోనూ హాట్ అప్పీల్ తెగ పండించేసింది. ఇక తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విషయానికి వస్తే, ఆ హాట్ అప్పీల్ మరీ ఎక్కువైపోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాలో బన్నీతో అనూ ఇమ్మాన్యుయేల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో పండించేసిందట. అయితే అనూకి ఈ సినిమా ఓ పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే, బన్నీ అంటేనే డాన్సుల్లో బీభత్సమైన ఎనర్జీ. ఆ ఎనర్జీని తట్టుకోవడం హీరోయిన్స్‌కి కూసింత కష్టమే. డాన్సుల్లో అనూ ఇమ్మాన్యుయేల్ ఇంతవరకూ తన టాలెంట్ ప్రదర్శించింది లేదు. కానీ ఈ సినిమాలో ఆ టాలెంట్ చూపించక తప్పలేదట. అందుకే డాన్సుల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుందట అనూ.
సో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో పాటు, డాన్సుల్లో కూడా బన్నీతో అనూ పోటీ పడిందని అంటున్నారు. చేసినవి చిన్న సినిమాలే అయినా, కానీ అనూకి చాలా తొందరగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. నిరాశ పరిచినా 'అజ్ఞాతవాసి' ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్ అచీవ్‌మెంట్‌గా చెప్పుకోవాలి. అలాగే 'సూర్య' కూడా.
సూర్యతో అనూ సక్సెస్ కానీ కొట్టిందా? ఇక అంతే ఆమె కెరీర్ గాడిన పడ్డట్లే. చూడాలి మరి 'సూర్య' అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఆదుకుంటాడో లేదో.!