ఈమధ్య తెలుగు సినీపరిశ్రమలో జరిగిన కొన్ని పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమలోని కొందరు పెద్దలు ఒక కీలక నిర్ణయానికి తీసుకున్నారు.
అదేంటంటే- ఈ అర్దరాత్రి 12 గంటల నుండి సినిమాకి చెందిన ఎటువంటి కార్యక్రమం కాని సినిమాకి సంబందించిన వీడియోస్, ప్రోమోస్ ని తెలుగు టీవీ చానల్స్ లో ప్రసారం చేయరు. అదేవిధంగా సినీ పరిశ్రమ నుండి ఏ విధమైన కంటెంట్ ని చానల్స్ వారికి పంపడం జరగదు.
దీనితో సినిమాలకి సంబంధించి ఎటువంటి కంటెంట్ అయినా సరే నిర్మాతల అనుమతి లేకుండా వేయకూడదు. ఒకవేళ అలా అనుమతి లేకుండా వేస్తే, అది చట్టరీత్యా నేరం అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అందరికి కంటెంట్ ఇవ్వడం మానెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నప్పటికీ తరువాత కాలంలో కొన్ని చానల్స్ కి ఈ నిర్ణయం నుండి మినహాయింపు ఇస్తారు అని తెలుస్తున్నది.
ఏదేమైనా.. తమని చులకనగా చూపిస్తూ అలాగే మాట్లాడుతుండడంతో ఇలా కంటెంట్ ఆపేసే సంచలన నిర్ణయానికి దారి తీసింది.