మొన్నీమధ్యనే ఎన్టీఅర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులకి ఒక పెద్ద షాక్ లా తగిలింది.
ఇక ఇలా ఎందుకు జరిగింది అని అందరు తమకి నచ్చిన జవాబులతో సరిపెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ ఈ చిత్రం ఆగిపోవడానికి కారణాలు ఏంటి అని ఆరా తీశారట. ఆసక్తికరంగా ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనుల కోసం తీసుకున్న ఇంటి వాస్తు బాగోలేదు అని ఆయన దృష్టికి వచ్చిందట.
ఇక వెంటనే ఆ ఇంటిని ఖాళీ చెయ్యాలి అని చిత్ర యూనిట్ కి సూచించారట. త్వరలోనే మరో చోటులో ఈ స్క్రిప్ట్ పనులు అలాగే ఈ చిత్రానికి సంబందించిన పనులు మొదలవుతాయి అని ఎన్టీఆర్ సినిమా సన్నిహిత వర్గాలు తెలియచేశాయి.
కాకపోతే ఎన్టీఆర్ బయోపిక్ కి ఇటువంటి అడ్డంకులు రావడం ఆయన ఫ్యాన్స్ కి మింగుడుపడని నిజమే అని చెప్పాలి.