'మజ్ను' సినిమాతో హిట్ అందుకున్న ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ని అందరూ లక్కీ గాళ్ అంటూ మునగచెట్టు ఎక్కించేశారు. ఆ ఇమేజ్‌తోనే యంగ్ హీరోల సరసన వరుస ఆఫర్లు దక్కించుకుంటూ, జోరు జోరుగా కెరీర్ స్టార్ట్ చేసిన అనూ ఇమ్మాన్యుయేల్‌కి 'అజ్ఞాతవాసి' రూపంలో అదృష్టం దక్కిందనాలో, దురదృష్టం వెంటాడేస్తోందనాలో తెలీడం లేదు.
కానీ ఎప్పుడయితే 'అజ్ఞాతవాసి' సినిమాకి సైన్ చేసిందో అప్పటి నుండీ ఆమె కెరీర్లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఆ సినిమా రిజల్ట్‌తో అనూ కెరీర్ ఎక్కడికో పోతుందనుకుంటే, ఇంకెక్కడికో పోయింది. ఆ తర్వాత రావల్సిన బిగ్ ఆఫర్స్‌ని పోగొట్టుకుంది. ఎలాగోలా కంప్లీట్ చేసిన 'నా పేరు సూర్య' ఫెయిల్యూర్ ఖాతాలో చేరిపోయింది. ఇకపోతే తాజాగా అనూ పాప చేతిలో ఉన్న ఏకైక చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. నాగచైతన్య హీరోగా రమ్యకృష్ణ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.
ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ఈగో ఎక్కువ ఉన్న అమ్మాయి పాత్రలో నటిస్తోంది. అయితే ఆ ఈగోతో అమ్మడు ఏం సాధిస్తుందంటారూ? ఏమో తెలీదు. ఏం సాధించినా సాధించకపోయినా, ఎట్ లీస్ట్ యావరేజ్ హిట్ అయినా సాధిస్తే కానీ అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ ఓ గాడిన పడేది లేదు. ఈ ముద్దుగుమ్మని హీరోయిన్గా పెట్టుకుందామంటే దర్శక నిర్మాతలు చాలా ఆలోచిస్తున్నారట. రిస్క్ చేయలేమని వెనక్కి తగ్గుతున్నారట. అలా అయిపోయింది పాపం అనూ పరిస్థితి.
ఏది ఏమైనా 'సూర్య' వల్ల కాలేదు. 'శైలజారెడ్డి అల్లుడు' అయినా అనూ కెరీర్‌ని ఓ గాడిన పెడతాడో లేదో చూడాలి మరి.