'అజ్ఞాతవాసి' స్టేజ్‌పై అందాల అనూ ఇమ్మాన్యుయేల్ స్పెషల్‌గా ఆకట్టుకుంది. ఊదా రంగు చీరలో గ్లామరస్‌గా కనిపిస్తూనే అందాలొలింకించింది. అంతకన్నా అందంగా తెలుగులో మాట్లాడి అందర్నీ కట్టి పడేసింది. మధ్య మధ్యలో చిరు నవ్వులొలుకుతూ, కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేసింది.
ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ విషయంలో త్రివిక్రమ్‌తో ప్రశంసలు అందుకుంది కూడా. మామూలుగా హీరోయిన్లు తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకోవడంలో వింతేముంటుంది అనుకోవడానికి లేదు. అది చాలా గొప్ప విషయమే.. ఎందుకంటే వారి భాష కాదు, వారి ప్రాంతం కాదు, అలాంటిది తమకు తెలియని కొత్త భాషను నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకోవడం నిజంగా గొప్ప విషయమేనని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు.
ఈ సినిమాలో నటించిన ఇద్దరు భామలు కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇకపోతే 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్‌లో ఇద్దరు భామలూ విశేషంగా ఆకట్టుకున్నారు. డిఫరెంట్ కాస్టూమ్‌లో కీర్తి సురేష్ ఎట్రాక్ట్ చేయగా, శారీ అందాలతో అనూ ఇమ్మాన్యుయేల్ కట్టి పడేసింది. చాలా కూల్‌గా మైక్ పట్టుకుని సినిమా గురించి, టెక్నీషియన్స్ గురించి క్యూట్ క్యూట్‌గా మాట్లాడింది.
సినిమాలో సూపర్ హాట్‌గా రొమాన్స్ పండించిందట అనూ ఇమ్మాన్యుయేల్. టీజర్‌లోనూ, నిన్న విడుదలైన ఓ మేకింగ్ ప్రోమో సాంగ్ వీడియోలోనూ ఆ విషయం తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే తెరపై పవన్‌ని చూసి ఆయనని అభిమానించా. ఇప్పుడు పవన్ పక్కన నటించడం చాలా ఆనందంగా ఉందనీ చెప్పింది.