'ప్రేమమ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ అనుపమా పరమేశ్వరన్. మంచి విజయం అందుకుంది. చిన్న క్యారెక్టరే అయినా రిజిస్టర్డ్ క్యారెక్టరే అది. ఆ తర్వాత త్రివిక్రమ్ 'అ ఆ' సినిమాతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మరోసారి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'శతమానం భవతి' సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా తిరుగులేని సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుందీ ముద్దుగుమ్మ. అక్కడి వరకూ అనుపమా కెరీర్ ఫాస్ట్‌గానే నడించింది.
'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో మరోసారి నిడివి తక్కువ ఉన్న క్యారెక్టర్ పోషించింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన 'తేజ్ ఐ లవ్‌యూ' కూడా నిరాశపరిచింది. దాంతో అనుపమకు తన సెలెక్షన్ మీద అనుమానం వస్తోందట. ఎలాంటి క్యారెక్టర్స్‌ని ఎంచుకోవాలో తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానంటోంది. ఓ సినిమాని ఎంచుకునేటప్పుడు తన అభిప్రాయంతో పాటు, తన సన్నిహితుల అభిప్రాయం కూడా తీసుకుంటుందట. కానీ ఎందుకో ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకి సక్సెస్ దరి చేరడం లేదు.
అయినా తన స్టామినాపై తనకు నమ్మకం ఉందంటోంది. కొత్త పాత్రలు చేస్తూనే ఉంటానంటోంది. తాజాగా అనుపమా పరమేశ్వరన్ ఓ క్రేజీ ప్రాజెక్టుపై సైన్ చేసింది. ఆ సినిమా వివరాలు ఇంకా పూర్తిగా తెలియవు. కానీ ఆ సినిమాలో అనుపమా లాయర్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర తన కెరీర్‌కి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతుంది అనుపమా పరమేశ్వరన్.
మరోవైపు 'అఆ' లాంటి నెగిటివ్ తరహా పాత్రల్లో నటించే ఆలోచనలు కూడా చేస్తోందట అనుపమా పరమేశ్వరన్.