ఇక్కడ గ్లామర్‌గా అక్కడ లాయర్‌గా ఊరించేస్తోంది.!

By iQlikMovies - September 22, 2018 - 12:13 PM IST

మరిన్ని వార్తలు

మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తెలుగులో యంగ్‌ హీరో రామ్‌తో 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌ హాట్‌ స్టఫ్‌ అదిరిపోయింది. ఇంతవరకూ అనుపమాని గ్లామర్‌గా చూసింది చాలా తక్కువ. అలాంటిది పెద్ద గ్లామర్‌ అని చెప్పలేం కానీ, డైరెక్టర్‌ క్రియేటివిటీతో అనుపమాలోని గ్లామర్‌ యాంగిల్‌ని సింపుల్‌గా చూపించేశాడు. 

కుర్రకారు గుండెల్లో గుర్రాలు పరిగెత్తించాడు. 'చూశావా, నీ కోసమే..' అంటూ హాట్‌ హాట్‌ అందాలతో ఊరించి, సింపుల్‌గా హాట్‌ కాఫీ టేస్ట్‌ చూపించి సరిపెట్టేసింది అనుపమా 'హలో గురూ ప్రేమ కోసమే' టీజర్‌లో. ఇది గ్లామర్‌ సంగతి. మరిప్పుడేమో లాయర్‌గా తన టాలెంట్‌తో ఓ క్రిమినల్‌ కేసునే ఛేదిస్తానంటోంది. అది ఓ కన్నడ సినిమా కోసం. పునీత్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'నట సార్వభౌమ' సినిమాలో అనుపమా లాయర్‌ పాత్రలో కనిపించనుంది. జర్నలిస్టు హీరోతో కలిసి ఓ క్రిటికల్‌ క్రిమినల్‌ కేసును ఛేదించే ఈ పాత్రలో అనుపమా చక్కగా నటించేస్తోందట. 

ప్రస్తుతం కోల్‌కత్తాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అనుపమా, పునీత్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. డిశంబర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనీ కన్నడ సినీ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS