విజయ్‌ దేవరకొండ మళ్లీ మొదలెట్టేశాడు.!

By iQlikMovies - September 21, 2018 - 18:03 PM IST

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌దేవరకొండకు నటించడమే కాదు, తన సినిమాలను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో కూడా బాగా తెలుసు. ఇటీవల 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన ఈ హీరో ఇప్పుడు తన తాజా చిత్రం 'నోటా' ప్రమోషన్స్‌కి పక్కా స్కెచ్‌ ప్లాన్‌ చేశాడు. 

ఈ సినిమాని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 5న కానీ, 10న కానీ 18న కానీ 'నోటా'ని విడుదల చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ డేట్స్‌ విషయంలో నెలకొన్న కాస్త గందరగోళం నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ సలహా తీసుకున్నాడు తెలివిగా. తన సినిమాని ఎప్పుడు విడుదల చేయాలో ఫ్యాన్స్‌ డిసైడ్‌ చేయాలని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. 'నోటా' విడుదల తేదీ ఎప్పుడు.? అంటూ అడుగుతూ కింద అక్టోబర్‌ 5, 10, 18, అసలేమీ కాదు.. అనే ఆప్షన్లు ఇచ్చాడు. 

దాంతో ఫ్యాన్స్‌ ఎగబడి ఈ ట్వీట్‌కి షేర్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు. ఆ రకంగా ఈ సినిమాకి ఫ్రీగా ప్రమోషన్‌ జరిగిపోతోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'నోటా' ప్రచార చిత్రం ఇటీవల విడుదలైంది. మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ప్రస్తుత రాజకీయాలపై విజయ్‌ దేవరకొండ సంధిస్తున్న అస్త్రంలా ఈ సినిమా కనిపిస్తోంది. అందాల మెహ్రీన్‌ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 

చూడాలి మరి విజయ్‌దేవరకొండ రాజకీయం ఫలిస్తుందో లేదో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS