ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై స్పందించే రామ్‌గోపాల్ వర్మ ఇటీవల సమాజాన్ని కుదిపేసిన పరువు హత్యపై స్పందించారు. పరువు కోసం మారుతీ రావు అల్లున్ని హతమార్చాడు. ఆయన ముమ్మాటికీ హంతకుడే. అయితే పిరికిపందలా ఆయన ప్రణయ్‌ని హతమార్చి, పరువు కోసం హత్య చేయించానని ఒప్పుకుని తన చేతులారా తన పరువును బజారుకీడ్చుకుని ఏం సాధించాడు.? అని పేర్కొంటూ చేసిన ట్వీట్‌కి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మగారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే పరువు హత్యలు, ఫ్యాక్షన్ కక్ష్యల నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల్లో చూపించే రక్తపాతం లైవ్‌గా చూపించేశారు మారుతీరావు, మనోహారాచారి వంటి తండ్రులు. నిజంగా ఈ ఘటనలు విచారకరమైనవే. కులం పేరు చెప్పి జరిగిన ఈ హత్యలు సినీ ఫక్కీలోనే జరిగాయి.
ఇటీవల 'ఆఫీసర్' సినిమాతో ఆశించిన రిజల్ట్ అందుకోని వర్మ ప్రస్తుతం తదుపరి సినిమాపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఆయన శిష్యులు ఒక్కొక్కరుగా వస్తూ డైరెక్టర్స్‌గా సత్తా చాటుతున్నారు. ఆ రకంగా వర్మ మార్క్‌తో ఆయన శిష్యుల దర్శకత్వంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా దడదడలాడిస్తున్నాయి.