సుకుమార్ `రంగస్థలం`.... బాక్సాఫీసు దగ్గర సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో చరణ్ రేంజ్‌పెరిగింది. నటుడిగానూ మంచి మార్కులు తెచ్చుకొన్నాడు. రామలక్ష్మి పాత్రలో సమంత నటనకు ప్రశంసలు దక్కాయి. డీ గ్లామర్ పాత్రలో సమంత మెప్పించిన విధానం ఆకట్టుకొంది. సమంత కెరీర్‌లోనూ.. రంగస్థలం మేలిమి మలుపుగా నిలిచింది. నిజానికి.. సుకుమార్ కథ రాసుకొనేటప్పుడు రామలక్ష్మి పాత్రలో ఊహించుకొన్నది సమంతని కాదు.. మరో కథానాయికని. తనే అనుపమ పరమేశ్వరన్.
రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర కోసం అనుపమ పేరే అనుకొన్నారు. ఈ కథ... అనుపమకి వినిపించారు కూడా. ఈ కథ, ఇందులోని పాత్ర అనుపమకి కూడా బాగా నచ్చేశాయి.కానీ.. అప్పట్లో కాల్షీట్ల సమస్య వల్ల. ఈ సినిమా వదులుకొంది అనుపమ. అది కాస్త.. సమంత చేతికి వెళ్లిపోయింది. రామలక్ష్మి పాత్ర సమంతకు గేమ్ ఛేంజర్ గా మారిపోయింది. ''రామలక్ష్మి పాత్ర కోసం నన్నే సంప్రదించారు. కానీ కుదర్లేదు. అయితే.. ఆలోటు తీర్చేలా `18 పేజెస్` సినిమా నా చేతికొచ్చింది. ఈసినిమాలో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా కెరీర్‌లోని అత్యుత్తమ పాత్రల్లో ఇదొకటి'' అని చెప్పుకొచ్చింది అనుపమ. తను నిఖిల్ తో కలిసి నటించిన `18 పేజెస్` శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.