'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం ముందుగా క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ని సంప్రదించారట. సమంత ప్లేస్‌లో అనుపమాని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యిందట ఈ ముద్దుగుమ్మకి.
ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఇంతవరకూ ఎక్కడా పొక్కలలేదు కూడా ఈ వార్త. ఒకవేళ ఇది నిజమే అయ్యుంటే అనుపమా బిగ్గెస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందులోనూ అప్‌కమింగ్ హీరోయిన్స్‌కి లైఫ్‌లో ఒకే ఒక్కసారి వస్తుంటాయి. ఏ కారణంగా ఆ ఛాన్స్ మిస్ అయ్యిందో తెలీదు కానీ, ఇప్పుడే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. రామలక్ష్మిగా స్టార్ హీరోయిన్ అయిన సమంతకు దక్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాంటిది ఓ కొత్త హీరోయిన్‌గా అనుపమాకి ఈ పాత్ర దక్కి ఉంటే, ఆమె స్టార్‌డమ్ ఈ పాటికి ఎక్కడికో వెళ్లిపోయేది. ప్చ్ బ్యాడ్ లక్.
ఇకపోతే ప్రస్తుతం మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాలో నటిస్తోంది అనుపమా పరమేశ్వరన్. 'శతమానం భవతి' సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తదుపరి 'ఉన్నది ఒక్కటే జిందగీ'తో కాస్త నిరాశపరిచింది. ఇప్పుడిప్పుడే వరుసగా యంగ్ హీరోస్‌తో ఆఫర్లు దక్కించుకుంటోంది. 'తేజ్ ఐ లవ్‌యూ' చిత్రంతో పాటు, రామ్ హీరోగా 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రంలోనూ అనుపమా నటిస్తోంది.
ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోయే 'తేజ్ ఐలవ్‌యూ'తో అనుపమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలిక.